telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్‌ ఫుల్‌ బుజీ అయిపోయిన ఉప్పెన భామ !

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా ‘ఉప్పెన’. కృతిశెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇక సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే.  ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి కృతిని తెగ పొగిడేశాడు.  అయితే  కృతిశెట్టి తొలి చిత్రం ‘ఉప్పెన’ ఇవాళ జనం ముందుకొచ్చేసింది. తొలి చిత్రంతోనే కృతీకి నటిగా మంచి మార్కులు పడిపోయాయి. ఇప్పటికే నానితో పాటు సుధీర్ బాబు సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది కృతి. తాజాగా ఎన్టీయార్, త్రివిక్రమ్ మూవీలోనూ కృతి సెకండ్ లీడ్ చేయబోతోందని వార్తలొస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ షూటింగ్ పూర్తి చేసుకుని ‘శ్యామ్ సింగరాయ్’లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ తాజా షెడ్యూల్ కోల్ కతాలో మొదలైంది. 

Related posts