మలయాళంలో మంచి విజయం సాధించిన లూసిఫర్ సినిమా చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్ట్ లలో ఒకటి. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. జూలై నుంచి ఈ పొలిటికల్ డ్రామా షూటింగ్ మొదలవుతుందట. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ ఆసక్తికర టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రానికి “కింగ్ మేకర్” అనే టైటిల్ ను ఖరారు చేశారట. ఈ టైటిల్ సినిమా కథకు సరిగ్గా సరిపోతుందని భావించారట మేకర్స్. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం “లూసిఫర్” రీమేక్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిరు రీమేక్‌లో కొన్ని మార్పులను సూచించారు. దర్శకుడు మోహన్ రాజా తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి సరిపోయే విధంగా స్క్రిప్ట్‌ను చక్కగా తీర్చిదిద్దారట. చూడాలి మరి ఈ సినిమా టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారు అనేది.