ముందు నుంచి టిడిపి జనసేన కూటమి విజయం పట్ల ఆయన బలమైన నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చారు.
రెండు పార్టీలు కలిసి చంద్రసేనగా మారి నూట అరవై సీట్లను గెలుచుకుంటామని జోస్యం కూడా చెప్పారు.
కౌంట్ ఎక్కువ తక్కువ కావొచ్చేమో కానీ మొత్తానికి పవర్ లోకి వస్తుందని ఆయన ఎప్పుడో నాలుగు నెలల క్రితం, చెప్పిన మాటలు అక్షరాలా నిజమవుతున్నాయి.
ఇక్కడ ప్రభాస్ అభిమానులు ఎక్కువ సంతోష పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికారం మారుతోంది కాబట్టి జూన్ 27 విడుదల కాబోయే కల్కి 2898 ఏడి టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు.