విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాలిసిన ఉపాధ్యాయులే టిక్‌టాక్‌కు బానిసై వీడియోలు తీసుకుంటున్నారు.సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని చెప్పకుండా.. చిన్నారులకు కూడా టిక్‌టాక్ అలవాటు చేస్తున్నారు. అంతేకాకుండా స్కూల్లో అమ్మాయిలతో కలిసి టిక్‌టాక్ వీడియోలు తీస్తూ అలజడి రేపారు.
తెలంగాణలోని కొత్తగూడెం, రామవరం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. టీచర్లు, విద్యార్థినుల వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లపై మండిపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.