telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ మొత్తాన్ని నెపోటిజం నడిపిస్తోంది… ఇలియానా సంచలన వ్యాఖ్యలు

Ileana

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో పలు సూపర్ డూపర్ హిట్స్ తో స్టార్ స్టేటస్ పట్టేశాక బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. అక్కడ కొన్ని సినిమాలు చేసి.. తిరిగి టాలీవుడ్ వంక చూస్తోంది. ఈ మేరకు ఇటీవలే రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటించి అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ అమ్మడికి నాగార్జున సరసన నటించే మరో అవకాశం దక్కిందని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చారని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌లో నెపోటిజం ఉందంటూ ఇలియానా కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా.. టాలీవుడ్ మొత్తాన్ని నెపోటిజం నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసింది. కొత్త నటీనటులను, బయటనుంచి వచ్చిన వాళ్ళను ఇక్కడ ఎదగనీయరని ఈ గోవా బ్యూటీ చెప్పడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. దీంతో ఇలియానాపై ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts