నితిన్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన రంగ్‌దే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అయితే ఇంతలో నితిన్ తన తరువాతి సినిమా చెక్ మొదలు పెట్టేశాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ లీడ్ రోల్స్‌లో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. తాజాగా ఈ సినిమాలోని ‘నిన్ను చూడకుండా’ అనే పాటను గోవాలో చిత్రీకరించారు. నితిన్, ప్రియా ప్రకాశ్ వారియర్‌లపై చిత్రీకరించిన ఈ పాటతో సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరిగాయి. వాటిని అందుకునేలా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించారు. ఈ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఓ ఖైదీగా కనిపిస్తాడట. చదరంగం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ నెల 26న ‘చెక్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నితిన్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ చేస్తున్నాడు. మార్చి 26న ‘రంగ్ దే’ విడుదల చేయనున్నారు. మరోవైపు నితిన్ హిందీలో సూపర్ హిటైనా ‘అంధధున్’ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు.
previous post
next post