telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా సెంటర్లలో దారుణ పరిస్థితులు: దేవినేని

devineni uma disappointed on utsav arrangements

ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనా సెంటర్లలో కూడా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఆయా కేంద్రాల్లో పేషెంట్లను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కొడుకును ఆదుకోమని తండ్రి, తల్లికి బెడ్ ఇవ్వమని కూతురు 5 రోజులుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.

జగన్ గారూ మీ మంత్రి అనుచరుడు కరోనా టెస్ట్ టోకెన్లు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరోనా పేషెంట్లకు అరగంటలో బెడ్ ఇస్తామని చెప్పిన మీకు ఆసుపత్రిలో బెడ్లు లేక ప్రాణాలు కోల్పోతున్న బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు.రాష్ట్రంలోనిన్న ఒక్క రోజే ఏకంగా 10,167 కేసులు నమోదయ్యాయని, 68 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts