telugu navyamedia
సినిమా వార్తలు

“జడ్జిమెంటల్‌ హై క్యా” ట్రైలర్

Mental

కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం “జడ్జిమెంటల్‌ హై క్యా”. ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మర్డర్ మిస్టరీ నేపధ్యంలో కథ సాగుతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఆ మర్డర్ కంగనా, రాజ్ కుమార్ రావులలో ఎవరో ఒకరు చేశారని పోలీసులు అనుమానిస్తుంటారు. కొద్దిగా మతిస్థిమితం లేని బాబీ అనే పాత్రలో కంగనా మంచి నటన కనబరిచింది. రాజ్ కుమార్ రావు.. కేశవ్ అనే పాత్రలో కనిపించనున్నారు. కథ మొత్తం ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంటుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

ముందుగా ఈ సినిమాకు “మెంటల్ హై క్యా” అనే టైటిల్ ను ఖరారు చేసి ప్రకటించారు. కానీ టైటిల్‌ వెల్లడించడంతోనే ఈ సినిమా చుట్టూ వివాదాలు అలముకున్నాయి. మానసిక రోగులను అవమాన పరిచేలా ఈ టైటిల్‌ ఉందంటూ, టైటిల్‌ మార్చాలంటూ డిమాండ్‌ రావడంతో సినిమా పేరు “జడ్జిమెంటల్‌ హై క్యా”గా మార్చినట్లు బాలాజీ టెలీ ఫిల్మ్స్‌ తెలిపింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts