telugu navyamedia
సినిమా వార్తలు

మేకప్ లేకుండా కరీనా… పిక్ వైరల్

Kareena

సినిమా అంటేనే జిగేలుమనే తళుకుబెళుకుల రంగుల ప్రపంచం. అందులో కనిపించే హీరోయిన్లు ఎంతో అందంగా కన్పిస్తారు. ఆ అందానికే ప్రేక్షకులు ఫిదా అవుతారు. అయితే సినిమా నటీనటులను మేకప్‌ లేకుండా చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. ఎందుకంటే అసలు సినీ నటీనటులు మేకప్ లేకుండా బయటకు రావడం అనేది జరగదు. ఎప్పుడో ఒక్కసారి కానీ వారిని మేకప్‌ లేకుండా చూసే అవకాశం రాదు. తాజాగా బాలీవుడ్‌ భామ కరీనా కపూర్‌ ఖాన్‌ మేకప్‌ లేకుండా ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. “ఐదు నెలలు మరింత బలవంతులం కాబోతున్నాం” అని ఆమె క్యాప్షన్‌ జోడించింది. తాజాగానే బెబో తన 40 యేట అడుగుపెట్టింది. ఈ ఫోటోలో కరీనా ముఖం మీద ఒక్క మచ్చ కూడా లేకుండా ఉంది. ఆమె జుట్టు టైట్‌గా కట్టుకొని ఉంది. ఇక త్వరలోనే కరీనా కపూర్‌ మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే.

Related posts