telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వికారాబాద్ : … మంత్రి సబితారెడ్డి సుడిగాలి పర్యటన .. పలు అభివృద్ధి పనుల ప్రారంభం..

sabita reddy rangareddy tour as minister

విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో కలిసి మంత్రి.. తాండూరు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపారు. అనంతరం యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్‌లో గల పత్తి మిల్లులో సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. బషీరాబాద్‌లో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రిని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. అందుకు మంత్రి.. ముందు విధులకు హాజరు కావాలని.. తర్వాత కూర్చుని మాట్లాడతామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని కార్మికులతో చెప్పారు.

జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునితా రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి ఈ పర్యటనకు డుమ్మా కొట్టారు. మంత్రి పర్యటనలో పట్నం దంపతులు పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తాండూరు ప్రాంతంలోని మార్కెట్ కమిటీలకు నూతన చైర్మన్ల నియామకంలో ఎమ్మెల్యే& ఎమ్మెల్సీ మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి పర్యటనకు పట్నం దంపతులతోపాటు ఆయన వర్గీయులు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తమ్మీద తాండూర్ టీఆర్ఎస్‌లో ఈ వర్గపోరు ఎటువైపు దారి తీస్తుందోనని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.

Related posts