telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతా : మైకేల్ వాన్

ప్రపంచంలోనే అత్యుత్తమైన జట్టు ముంబై ఇండియన్సే అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తెలిపాడు. రోహిత్ అసాధారణమైన కెప్టెన్ అని, మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు చాలా తెలివిగా ఉంటాయని కొనియాడాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుకు ఓటమి తప్పదని, ఈ తరం క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, జోరూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, బాబర్ అజామ్‌లు అత్యుత్తమ ఆటగాళ్లని తెలిపాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య సిరీస్‌లో ఆతిథ్య జట్టే సులువుగా విజయం సాధిస్తుందన్న వాన్.. ప్రతీసారి భారత్‌లో ఇంగ్లండ్ ఓడటం.. ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఖంగుతినడం సాధారణమేనని తెలిపాడు.అయితే ముంబై ఇండియన్స్ జట్టులో ఏ ఆటగాడిని ఇంగ్లండ్ టీమ్‌లో ఉండాలనుకుంటావని ప్రశ్నించగా.. రోహిత్ శర్మ పేరు సూచించాడు. ధోనీ, విరాట్ కోహ్లీలో అత్యుత్తమ సారథి ఎవరనగా ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ధోనీకే ఓటేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ధోనీ బెస్ట్ అయితే.. సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్ ఉత్తమమన్నాడు. కానీ ఓవరాల్‌గా ధోనీనే అత్యుత్తమమని తెలిపాడు. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలలో ఎవరి బ్యాటింగ్ చూడటానికి ఇష్టపడతావు అని ప్రశ్నించగా.. విరాట్ పేరు సూచించాడు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోనని వాన్ స్పష్టం చేశాడు.

Related posts