telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ తర్వాత భారత కెప్టెన్ అతనే అంటున్న మాజీ చీఫ్ సెలెక్టర్…

కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్ రిషభ్ పంతేనని అభిప్రాయడ్డాడు మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే. జట్టును నడిపించగల నైపుణ్యాలు, సరైన మనస్థత్వం అతని సొంతమని తెలిపాడు. ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​కు సారథ్యం వహించిన అనుభవం అతనికి పనికొస్తుందని పేర్కొన్నాడు. తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ వారసత్వాన్ని కోహ్లీ అందిపుచ్చుకుంటే.. అతని స్థానాన్ని పంత్ భర్తీ చేయనున్నాడని తెలిపాడు. ‘రిషభ్ పంత్.. భవిష్యత్​లో టీమిండియా కెప్టెన్​గా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కెప్టెన్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు పంత్​కు ఉన్నాయి. అతని కెరీర్​ను ఓసారి పరిశీలిస్తే ప్రారంభంలో చాలా ఒడిదొడుకులు కనిపిస్తాయి. మొదట్లో అతను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల వల్లే అతను మానసికంగా దృఢంగా తయారయ్యాడు. తొలుత ప్రపంచకప్​కు ఎంపిక కాలేదు. టీ20లతో పాటు వన్డేలకూ జట్టులోకి తీసుకోలేదు. కానీ, అతను అనూహ్యంగా టెస్టు ఫార్మాట్​ ద్వారా జట్టు​లోకి వచ్చాడు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.’అని ​కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు అయితే . ఇటీవల ఆసీస్​తో జరిగిన టెస్టు సిరీస్​లో పంత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లో 274 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. జట్టుకు కీలకమైన సమయాల్లో రాణించాడు. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్​తో జరిగిన సిరీస్​లోనూ 270 పరుగులు చేసి జట్టుకు తానెంత ముఖ్యమైన ఆటగాడనేది నిరూపించాడు.

Related posts