నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త సినిమా ‘శ్యామ్‌సింగరాయ్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టైటిల్ సాంగ్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి ఓ అందమైన లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
ఇందులో ‘ఏదో ఏదో’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను గురువారం(నవంబరు 25) రిలీజ్ చేశారు. ఈ పాటలో నాని, కృతిశెట్టి కనువిందు చేస్తున్నారు. విభిన్న కథతో తీస్తున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కృష్ణ కాంత్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంటుంది. ఈ పాటను చైత్ర అందంగా ఆలపించగా మిక్కీ జే మేయర్ సంగీతమందించారు.
‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో డిసెంబరు 24న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
“బాహుబలి”కి ముందు “శివ”…: ప్రభాస్