telugu navyamedia
సినిమా వార్తలు

పెళ్లి పీటలెక్కనున్న ‘ముక్కు’ అవినాష్‌

హాస్యనటుడు ‘ముక్కు’ అవినాష్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు వెల్లడించాడు. ఇటీవలే ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అవినాష్ తన ఇన్‏స్టాలో షేర్ చేశారు.

‘‘సరైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తుంటే వేచి చూడాల్సిన అవసరం లేదు. మా కుటుంబాలు, మేము కలిశాం. అనుజతో నాకు నిశ్చితార్థం అయింది. ‘పెళ్లి ఎప్పుడు’ అని మీరంతా నన్ను చాలా సార్లు అడిగారు. ‘అతి త్వరలోనే నా అనుజతో’ ఎప్పటిలాగే మీ ఆశీస్సులు కోరుకుంటూ.. మీ ముక్కు అవినాష్‌’’ అని ఇన్‌స్టా వేదికగా నిశ్చితార్థం ఫొటోలను పంచుకున్నారు.

వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే అని తెలుస్తోంది. మరోవైపు అవినాష్‌కు సోషల్‌ మీడియా ద్వారా శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీముఖి, నోయల్‌, మెహబూబ్‌ సహాఅవినాష్‌ అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Related posts