telugu navyamedia
సినిమా వార్తలు

‘అప్పుడు ఇప్పుడు’ వచ్చేది ఎప్పుడంటే…

చలపతి పువ్వల దర్శకత్వంలో సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా న‌టించిన సినిమా ‘అప్పుడు-ఇప్పుడు’. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మించిన ‘అప్పుడు – ఇప్పుడు’ సినిమాలో శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ”ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రమిది.

Appudu Ippudu Movie To Release On September 3rd - Sakshi

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఇటీవల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విశ్వనాధ్ విడుదల చేసిన పాటతో పాటు పూరి జగన్నాద్‌ విడుదల చేసిన టీజర్‌కు అదరిపోయే రెస్పాన్స్‌ వచ్చింద‌ని, దర్శకుడు చలపతి చాలా అద్భుతంగా తెరకెక్కించాడ‌న్నారు.

Appudu Ippudu movie first look released - Sakshi

దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ “మా అప్పుడు-ఇప్పుడు చిత్రం టీజర్, సాంగ్స్ మంచి పాపులర్ అయ్యాయి.హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా చాలా చక్కగా నటించారు. మేకింగ్ లో ఎక్కడా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనాభ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు హైలైట్” అని అన్నారు.

Related posts