telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బ్యాచిలర్ పార్టీలో కాజల్… పిక్స్ వైరల్

Kajal

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు మంగళవారం సోషల్‌మీడియా ద్వారా ఆమె స్వయంగా ప్రకటించింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే బ్యాచిలర్ పార్టీలో తన స్నేహితులతో కలిసి కాజల్ సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. సెప్టెంబర్‌ నెలాఖరున కాజల్‌ నివాసంలో జరిగిన ఈ పార్టీలో ఆమె కుటుంబసభ్యులు, గౌతమ్‌ కిచ్లు సోదరితో పాటు అతి తక్కువ మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ పార్టీలో భాగంగా కాజల్ బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి.. ‘బ్రైడ్‌ టు బి’ క్యాప్షన్‌తో నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చింది. కాజల్ పెళ్లి వార్త బయటకు రాగానే ఆమె కాబోయే భర్తతో దిగిన పాత ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నారు.

Related posts