telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ సీన్ టీడీపీ వాళ్ళకే ఎక్కువ నచ్చింది… చాలా సంతోషిస్తున్నారు : ఆర్జీవీ

KRKR

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై వర్మ సెటైరికల్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్స్‌ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్ధార్థ్‌ తాతోలుతో కలిసి వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ స్టార్‌ కాస్ట్‌ ఏది లేకపోయినా వర్మ తనదైన ప్రమోషనల్‌ స్ట్రాటజీతో సినిమాకు కావాల్సినంత హైప్‌ తీసుకువచ్చాడు. సెన్సార్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడారు. సినిమాలో పాత్రలన్నీ ఊహాజనితమైనవేనని.. ఇప్పటి వరకు జరగనిది చూపించబోతున్నామని చెప్పుకొచ్చారు. రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో జరిగినది చూపించామని.. కానీ దీనిలో మున్ముందు జరగబోయేది చూపిస్తున్నామన్నారు. ఇది రాజకీయ వ్యంగ్య చిత్రమని, కొంతమంది ప్రముఖులను పోలిన వారు ఉండటం యాదృచ్ఛికమేనని.. ఎవరినీ ఉద్దేశించినది కాదని తెలిపారు. ఒకవేళ అలా చేస్తే దేవుడు తనను శిక్షించుగాక అంటూ తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. ఇక ఈ సినిమాలో పప్పు సీన్ గురించి రిపోర్టర్లు ప్రశ్నించగా.. ఆ సీన్ టీడీపీ వాళ్లకే ఎక్కువగా నచ్చిందని.. చాలా మంది తనకు ఫోన్లు చేశారని అన్నారు. వాళ్ల అంతర్గత భావాలను తాను చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నారని తెలిపారు.

Related posts