తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చేరారు… శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఇవాళ్టితో 48 గంటలు గడిచింది… వైద్యులు చెబుతున్న ప్రకారం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. బీపీ అదుపులోనే ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు నిన్న సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళనరమైన అంశాలు లేవని తెలిపారు. మరికొన్ని పరీక్షలు చేశామని.. వాటి రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు. ఆ వైద్య పరీక్షల నివేదికలతో పాటు బీపీ స్టేటస్‌ను రాత్రంతా చూసిన తర్వాత.. రజినీకాంత్‌ను డిశ్చార్జిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని వైద్యులు వెల్లడించారు. అన్నాత్తై షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజినీకాంత్ గత 10 రోజులుగా సిటీలోనే ఉన్నారు.. అయితే, చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్‌గా రావడంతో.. షూటింగ్ నిలిచిపోయింది.. రజినీకాంత్ క్వారంటైన్‌కు వెళ్లిపోయారు.. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గానే వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణాలు కూడా లేవు. అయితే, ఉన్నట్టుండి శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. రజినీ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంది. ఇక, రాత్రంతా రజనీ బీపీ లెవెల్స్ మానిటరింగ్ చేశారు.. అంతా ఒకే అనుకుంటే ఇవాళ డిశ్చార్జ్ చేస్తామంటున్నారు అపోలో వైద్యులు.
previous post
వై .సి .పి నాయకులను మూసుకొని కూర్చోమని చెప్పలేరా ?