telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్తవాళ్ళను కూడా పట్టించుకోండి… యంగ్ హీరోల పంచులు… ఎవరికంటే ?

CC

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి ‘చూసి చూడంగానే’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. సినిమా రేపు విడుదల కాబోతోంది. సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. శ్రీవిష్ణు, రేణు దేశాయ్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ, అడివి శేష్, కత్తి మహేష్.. ఇలా ఎందరో సినీ ప్రముఖులు అతిథులుగా విచ్చేసారు. అయితే ఈవెంట్‌లో కార్తికేయ, శ్రీవిష్ణు స్టేజ్‌ మీద వేసిన పంచ్‌లు వైరల్ అవుతున్నాయి. ఈవెంట్‌కు హాజరైన కుర్ర హీరో కార్తికేయ స్టేజ్‌పైకి రాగానే యాంకర్ సుమ ఆయన్ను ఓ ఆటాడుకున్నారు. ‘మీకు శివ కందుకూరిని చూస్తే కాంపిటీషన్ అనుకుంటున్నావా? లేక ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నావా?’ అని అడిగారు. ఇందుకు కార్తికేయ ఆన్సర్ ఇస్తూ.. ‘నేను మొదటిదే అనుకుంటున్నాను. ఎంకరేజ్ చేయడానికి నేనేమైనా చిరంజీవినా. శివను మొదటిసారి కలిసినప్పుడే ఏంటి ఈ అబ్బాయి ఇంత బాగున్నాడు సినిమాల్లోకి వస్తే మనకు కాంపిటీషనే కదా అనుకున్నాను’ అన్నారు.

శ్రీవిష్ణు ఏకంగా రాజ్ కందుకూరికే పంచ్‌లు వేశారు. ‘‘శివ మంచి హీరోగా ఎదగాలని, ఆయన నిర్మాణ సంస్థకు ఆయనే డేట్లు ఇవ్వలేనంత బిజీ అయిపోవాలని అనుకుంటున్నాను. మీ కుమారుడితోనే సినిమాలు చేయకుండా ఎప్పటిలాగే మీరు కొత్తవాళ్లకి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను రాజ్ కందుకూరిగారు. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ సినిమాలే ఎక్కువైపోయాయి. స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్స్‌తో మాత్రమే పనిచేస్తున్నారు. కానీ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే నిర్మాతల్లో రాజ్ కందుకూరి గారు ఎప్పుడూ మొదటిస్థానంలో ఉంటారు’’ అని కామెంట్స్ చేశారు.

Related posts