telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పొలంలో పక్షి గుడ్లు .. పొడుగుతున్న పక్షి.. దున్నటానికి వచ్చిన రైతు ఏమి చేశాడంటే..

farmer kind heart on bird

పక్షి తను పెట్టిన గుడ్లను ఒక పొలంలో దాచి, అక్కడే పొదుగుతుంది. ఆ గుడ్డులో నుండి పిల్ల బయటకు వచ్చేవరకు అక్కడే ఉంటుంది. అక్కడి నేలను దున్నేందుకు ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో వస్తుండగా.. ఈ విషయాన్ని గమనించిన ఆ పక్షి.. తన గుడ్లకు ఏమవుతుందోనని… రెక్కలాడిస్తూ ట్రాక్టర్ ముందుకు వెళ్లి అడ్డ‌గించింది.

దీంతో వెంటనే ట్రాక్టర్‌ను ఆపి.. ఆ పక్షి పొదిగిన గుడ్లను గమనించి.. అక్కడి నుంచి వేరే మార్గంలో ట్రాక్టర్ పోనిస్తాడు ఆ వ్యక్తి. అంతే కాదు.. ఆ పక్షి తల్లి ప్రేమను అర్థం చేసుకున్న అతడు.. దాని కోసం ఓ బాటిల్‌లో నీళ్లను కూడా పెడతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన చైనాలోని ఉలాన్‌క్వాబ్ సిటీలో చోటు చేసుకున్నది.

Related posts