telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ‘జల్సా’కు 12 సంవత్సరాలు

JALSA

ఖుషీ తర్వాత ఏడేళ్ల పాటు ఒక్క విజయం అంటూ వేచి చూసిన పవన్ అభిమానులకు మాత్రం జల్సా తో చిందులు వేశారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు యువతలో కేరింతలు పెట్టించాయి. ఈ చిత్రం 2008, ఎప్రిల్ 2న విడుదలైంది. 2008లోనే 33 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది జల్సా. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు బీజం వేసింది ఈ చిత్రం. దానికి ముందు జానీ, గుడుంబా శంకర్‌, బాలు, బంగారం, అన్నవరం లాంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ మరో బలం. సినిమాలో పవన్ నక్సలిజం ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా అదనపు ఆకర్షణ. యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడమే కానీ చంపడం కాదంటూ త్రివిక్రమ్ చెప్పిన ఫిలాసఫీ కూడా బాగానే వర్కవుట్ అయింది. మాటల మాంత్రికుడి అద్భుతమైన మాయే ఈ జల్సా.

Related posts