కంటెస్టెంట్స్ కుటుంబసభ్యుల రాకతో గత కొన్నిరోజులుగా బిగ్‌బాస్ హౌస్ ఎమోషన్స్‌తో నిండిపోయింది. ప్రతి సీజన్‌లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ బిగ్‌బాస్‌లోకి ఎంటర్ కావడంతో సందడి నెలకొంది.
ఇప్పటికే కాజల్, శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, మానస్‌ల కుటుంబసభ్యులు ఎంటర్ అవగా, తాజాగా విడుదలైన ప్రోమోలో యాంకర్ రవి కోసం భార్య నిత్య, కూతురు వియా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
మొదట హౌస్‌లోకి వెళ్లిన రవి సతీమణి ఆయన్ని హత్తుకోగానే.. ‘‘వియా రాలేదా.. నేను తనని బాగా మిస్ అవుతున్నాను’’ అని అసంతృప్తికి గురయ్యాడు. తాను ఎంతో ప్రయత్నించినప్పటికీ కుదరలేదని, అందువల్లే ఒక్కదాన్నే హౌస్‌లోకి వచ్చానని ఆమె చెప్పడంతో రవి ఏం మాట్లాడలేకపోయాడు. అనంతరం, ‘‘లవ్ యూ పప్పా’’ అంటూ వియా ఎంట్రీ ఇవ్వడంతో రవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ప్రతిరోజూ వియా ఫోటో చూడనిదే నిద్ర లేవని రవి నేరుగా కూతుర్ని చూడటంతో సంతోషంలో మునిగిపోయాడు. ప్రేమగా హత్తుకొని కాసేపు కబర్లు చెప్పడంతో పాటు సరదాగా ఆడిస్తాడు. రవి కూతురు బిగ్‌బాస్‌ని చూడాలని ఉందని, బిగ్‌బాస్ ఒక్కసారి కనిపించు అని అంటుంది. ఇక ‘‘వియా ఇంటిని వీడే సమయం ఆసన్నమైంది’’ అని బిగ్‌బాస్ చెప్పగానే.. ‘‘ఐ లవ్ యూ.. బాయ్ డాడీ’’ అంటూ ఆ చిన్నారి కన్నీరు పెట్టుకొవడం చూసిన వాళ్లు ఎమోషనల్ అవ్వాల్సిందే..
దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్ చేసింది. ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
అనసూయ, హైపర్ ఆది కెమిస్ట్రీ… రైజింగ్ రాజు కామెంట్స్