రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. తెలంగాణలోని మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
రంగారెడ్డిలో 2 స్థానాలు, వరంగల్‌లో ఒక స్థానం.. నిజామాబాద్‌లో ఒక స్థానం, మహబూబ్‌నగర్‌లో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానానికి, కరీంనగర్‌లో 2 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. డిసెంబర్ 14నఓట్ల లెక్కింపు జరుగుతుంది. అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.