telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉపేంద్ర “కబ్జ” ఫస్ట్ లుక్

Kabja

క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర తాజాగా “క‌బ్జ” అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. గ్యాంగ్‌స్ట‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను ద‌ర్శ‌కుడు చంద్రు తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియ‌న్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రూపొంద‌నుంది. నేటి నుండి చిత్ర షూటింగ్ ప్రారంభం కానుండ‌గా, మూవీలో ఉపేంద్ర లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఆయ‌న లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అండర్ వరల్డ్ నేపథ్యం లో రూపొందనున్న మాస్ ఎంటర్ టైనర్ కబ్జ మూవీ 7 భాషలలో రిలీజ్ కానుంది. ఇందులో ఏడుగురు విల‌న్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. బాలీవుడ్‌కు చెందిన నానా పటేకర్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రకాశ్‌రాజ్‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి , ప్ర‌దీప్ రావ‌త్‌, స‌ముద్ర‌ఖ‌నిల‌ని విల‌న్స్‌గా ఎంపిక చేసుకున్న‌ట్టు స‌మాచారం. నిర్మాత, దర్శకుడు ఆర్ .చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా రూపొందిన “ఐ లవ్ యు” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Related posts