telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జయహో తెలంగాణ పోలీస్… : అనుపమ్ ఖేర్

Anupam

హైదరాబాద్‌లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు దుర్మార్గులు దారుణంగా రేప్‌ చేసి తరువాత సజీవ దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఇలాంటి దారుణాలు ఇక మీదట జరగకుండా గట్టి చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ దారుణానికి పాల్పడ్డ రాక్షసులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. అయితే తాజాగా పోలీస్ ఎన్కౌంటర్ లో నిందితులు చావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్‌పల్లికి వ్యాన్‌లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. “జ‌య‌హో.. తెలంగాణ పోలీస్‌. నేరానికి పాల్ప‌డిన వారికి వ్య‌తిరేఖంగా స్వ‌రం ఎత్తి, వారిని ప్ర‌మాదక‌రంగా శిక్షించాల‌ని కోరుకునే ప్ర‌జ‌లంద‌రు, బిగ్గ‌ర‌గా అర‌వండి.. జ‌య‌హో” అని అనుప‌మ్ ఖేర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. “బ్రావో తెలంగాణ పోలీస్‌.. మీకు నా శుభాకాంక్ష‌లు” అని రిషి క‌పూర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

Related posts