telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ తో “ఇస్మార్ట్” దర్శకుడు ?

Chiranjeevi

రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ చూపిస్తున్నాడు. దీంతో టాలీవుడ్ దర్శకులు మెగా ఛాన్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ జాబితాలో పూరీ జగన్నాథ్ పేరు తప్పక వినిపిస్తుంది. చిరుతో సినిమా చేయడానికి పూరీ చిరకాలం నుండి చూస్తున్నాడు. చిరు తనయుడిని లాంచ్ చేసిన జగన్, మెగా స్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం దక్కించుకోలేకపోయాడు. అయితే లేటెస్ట్ గా సక్సస్ ట్రాక్ లోకి వచ్చిన పూరీ డ్రీమ్ ఇప్పుడు నిజం కాబోతుందట. నిజానికి చిరు 150 వ సినిమా పూరీ దర్శకత్వంలోనే ఉండబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ..,’ఆటో జానీ’ కథ మెగా హీరోని పూర్తిగా మెప్పించలేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్ అదే కథతో మెగా ఆఫర్ ని దక్కించుకున్నట్టు సమాచారం. చిరు సలహా మేరకు పూరీ ‘ఆటో జానీ’ సెకండ్ ఆఫ్ స్టోరీ పూర్తిగా మార్చేశాడట. దానితో ఈ సారి చిరుకి కథ బాగా నచ్చిందట. ఈ కారణంగానే ఇప్పుడు చిరంజీవి ‘ఆటో జానీ’ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్.. కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకొని నటించిన ‘సైరా’ లెక్కలు సరి చేయలేకపోవడంతో మెగాస్టార్ ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటన్నాడు. మరోవైపు పూరీ కూడా ‘ఫైటర్’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో పట్టాలెక్కించడానికి సిద్దమయ్యాడు. దీనితో వీరిద్దరూ ఇప్పటికే ఉన్న కమిట్ మెంట్స్ పూర్తి చేసుకున్న తరువాతే ఆటో జానీని మొదలు పెట్టనున్నారట.

Related posts