కొన్ని రోజుల క్రితం అజయ్ దేవగణ్ తండ్రి వీరు దేవగణ్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ ఇంట్లో జరిగిన ఈ విషాదం అందరిని శోకసముద్రంలో ముంచేసింది. బాలీవుడ్ ప్రముఖులు అజయ్ ఇంటికి వచ్చి ఓదార్చారు. కుటుంబం ఇంకా ఆ సంఘటన నుంచి తేరుకోలేదు. ఇది జరిగిన మరుసటి రోజు కాజోల్ మదర్ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు కాజోల్ ముద్దుల కూతురు నైసా దేవగణ్ తన ఫ్రెండ్స్ తో కలిసి నగరంలో ఓ పార్లర్ కు వెళ్లి ఎంజాయ్ చేసింది. అక్కడి నుంచి బయటకు వచ్చే సమయంలో ఈ అమ్మడు మీడియా కంటపడింది. ఇంకేముంది. మీడియా టపిటపి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత నెటిజన్లు చూస్తూ ఊరుకుంటారా చెప్పండి.. కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
ఇంట్లో అశుభకార్యం జరిగి కొన్నిగంటలైనా కాకముందే ఇలా ఇదేంటి.. ఈ డ్రెస్ ఏంటి అని కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతైనా స్టార్ కిడ్స్ కాబట్టి వాళ్లపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. బాధను మర్చిపోవడానికి ఇలా చేసి ఉండొచ్చు కదా. దానికి ఎందుకు ఇంతలా రాద్ధాంతం చేస్తున్నారని కొందరు మెసేజ్ లు చేస్తున్నారు. నైసా కాజోల్ మామూలు డ్రెస్ లో వచ్చి ఉంటె పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో వచ్చేసరికి షాక్ తిన్నారు. దీంతో ఇలా కామెంట్స్ వరద మొదలైంది. మరి దీనిపై కాజోల్ గాని, అజయ్ దేవగణ్ గాని ఇంతవరకు స్పందించలేదు. చూద్దాం వారి భావన ఎలా ఉందొ.