telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

చెవిలో పుల్లలు పెట్టుకుంటున్నారా.. హార్ట్ ఎటాక్ వస్తుంది.. జాగర్త!!

few strange facts about body and health

కలిసి పనిచేయడం అనేది మనం అంటే లక్షలు పోసి పెద్దపెద్ద విద్యాలయాలలో చదుకుఉంటున్నాం కానీ, ఒక్కసారి నిశ్చితంగా మన శరీరాన్ని పరిశీలిస్తే, అందులో ప్రతి అవయువం ఒకదానితో మరొకటి సహాయసహకారాలు అందించుకుంటూ ఎలా కలిసి పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఒక్క శరీరాన్ని గమనిస్తేనే, ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం మరొక అవయవంతో అనుసంధానం అయి ఉంటుంది. దీనికి నిదర్శనంగా, ఇటీవల పరిచయం అవుతున్న అక్కుపంచర్, చైనా సూదులతో చేసే వైద్యం .. చెప్పవచ్చు.

ఏదైనా విషయం మనకు తెలియనప్పుడు ఎలగైతే పెద్దలను అడిగి తెలుసుకుంటామో అదేవిధంగా, మన శరీరం గురించిన అనేక విషయాలు డాక్టర్ల ద్వారా మనం తెలుసుకుంటాం. అలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోండి..!

* మ‌నం చెవిలో ఉండే గులిమి తీయ‌డం కోసం చెవిలో ఇయ‌ర్ బ‌డ్స్ లోప‌లి వ‌ర‌కు పోనిచ్చి తిప్పుతాం క‌దా. దీని తో ప్ర‌మాద‌మేన‌ట‌. ఇలా చేయ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. ఎలా అంటే. చెవిలో ఇయ‌ర్ బ‌డ్స్ పెట్టి తిప్పిన‌ప్పుడు అందులో ఉండే ఓ ప్ర‌త్యేకమైన నాడి వ‌ల్ల Vagal stimulation జ‌రిగి అక్క‌డి నుంచి ఎల‌క్ట్రిక్ షాక్ గుండెకు చేరుతుంద‌ట‌. దీని తో హార్ట్ ఫెయిల్యూర్‌, హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. అందుకే చెవిలో పుల్లలు,ఇయర్ బడ్స్ పెట్టకూడదని డాక్టర్లు చెప్తుంటారు.

* ఇక చెవి శుభ్రత విషయానికి వస్తే, గులిమి అదంతట అదే బయటికి పడిపోతుందట. కాబట్టి ఇకపై బడ్స్ లాంటివి చెవిలో పెట్టకండి.

few strange facts about body and health* మ‌న నిత్యం మ‌లాన్ని విస‌ర్జించే ద్వారం క‌న్నా మ‌న నోట్లోనే ఎక్కువ బాక్టీరియా, వైర‌స్‌లు ఉంటాయ‌ట తెలుసా? అవును, ఇది నిజ‌మే. సాక్షాత్తూ వైద్యులే ఈ విష‌యాన్ని చెబుతున్నారు.

* గుండె ఆగితే చనిపోతారని మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు తెలుసుకుంటూ వ‌చ్చాం క‌దా. అయితే ఇది నిజం కాదు. ఎందుకంటే గుండె ఆగినా ప‌లు ప్ర‌త్యేక‌మైన ట్రీట్‌మెంట్స్ ఇస్తే వెంట‌నే బ‌తుకుతార‌ట‌.

ఇటీవల ఒక మ‌హిళ‌కు 20 నిమిషాల పాటు గుండె ప‌నిచేయ‌లేద‌ట‌. దీని తో ఆమెకు వైద్యులు ఐసీయూలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. 20 నిమిషాల తర్వాత ఈ మ‌హిళ వెంట‌నే లేచి కూర్చుని న‌వ్వుతూ ఇంటికి వెళ్లిపోయింద‌ట‌. అయితే ఆ స‌మ‌యంలో ఆమెకు నిద్ర పోయిన‌ట్టు అనిపించింద‌ట‌.

* మ‌న నిత్యం తినే అనేక ర‌కాల ఆహార ప‌దార్థాల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే దాదాపుగా అన్ని విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ వెజ్ ఆహారాల్లో ఉంటాయి, కానీ విట‌మిన్ బి12 మాత్రం కేవ‌లం జంతు సంబంధ ప‌దార్థాల్లో మాత్ర‌మే మ‌న‌కు ల‌భిస్తుంద‌ట‌. క‌నుక వెజ్ ప్రియులు ఈ అంశం ప‌ట్ల చింతించాల్సిందే మ‌రి!

* విట‌మిన్ బి12 ఒక్కటి దొర‌క్క‌పోతే ఏమి కాదులే.. అని సుల‌భంగా తీసేయ‌వ‌ద్దు. ఎందుకంటే ఈ విట‌మిన్ లోపించ‌డం వ‌ల్ల మెద‌డు స‌రిగ్గా ఎద‌గ‌ద‌ట‌. జ్ఞాప‌క‌శ‌క్తి మంద‌గిస్తుంద‌ట‌. దీనికి తోడు హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువగా ఉంటాయ‌ట‌.

few strange facts about body and healths* విట‌మిన్ ఎ మ‌న‌కు చాలా అవ‌స‌ర‌మ‌ని అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగు ప‌డ‌డ‌మే కాదు, నేత్ర స‌మస్య‌లు పోయి దృష్టి బాగా వ‌స్తుంది. నిజానికి ఈ విట‌మిన్ ఉన్న ప‌దార్థాల‌ను అధిక మోతాదులో తీసుకోకూడ‌ద‌ట‌. అలా తీసుకుంటే శ‌రీరంలో మొత్తం విష‌తుల్యం అయి చివ‌ర‌కు చ‌నిపోతార‌ట‌. ఉత్త‌ర ధృవంలో ఉండే పౌరులు అక్క‌డ ల‌భించే ఎలుగుబంటి లివ‌ర్‌ను తినేవార‌ట‌. అందులో విట‌మిన్ ఎ అధిక మోతాదులో ఉండ‌డం వ‌ల్ల వారి శరీరాలు విష‌తుల్యం అయి చ‌నిపోతున్నార‌ట‌.

* ఆయిల్ ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటే శ‌రీరంలో కొలెస్ట్రాల్ పెరిగి తద్వారా గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందని, గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చ‌దివుకున్నాం. కానీ అది నిజం కాద‌ు. నిజానికి రిఫైన్డ్ పిండి, చ‌క్కెర, ఉప్పు వంటివి ఎక్కువ‌గా తింటేనే గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. పైగా ఆయిల్ ఫుడ్స్‌ను తింటే ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌ద‌ు, ఫలితంగా ఇలాంటి రిఫైన్డ్ పిండి ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చ‌ు.

Related posts