telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

రెస్టారెంట్ బాత్రూమ్ లో యువతి ప్రసవం… ఆ తరువాత సీన్ తో నిర్వాహకులకు షాక్

Applebees

అమెరికా, టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. యువతి ఆపిల్‌బీ అనే ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. రెస్టారెంట్‌లోని బాత్రూంకు వెళ్లిన యువతి.. అందులోనే ప్రసవించింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాదాపు అరగంట తరువాత రెస్టారెంట్ సిబ్బంది పక్కనే ఉన్న డస్ట్‌బిన్‌లో చనిపోయిన బిడ్డను చూశారు. యువతి బిడ్డను కని ఇలా పడేసి వెళ్లిపోయిందని వారు గుర్తించారు. రెస్టారెంట్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు యువతికి సంబంధించిన వివరాలు సేకరించారు. బిడ్డ పుట్టడంతోనే మరణించిందా లేదా ప్రాణాలతో పుట్టిన తరువాత యువతి చంపేసిందా అన్నది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. యువతి ఈ పని ఎందుకు చేసిందో పూర్తి వివరాలు తెలుసుకుంటామని అధికారులు తెలిపారు.

Related posts