telugu navyamedia
సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ తో షూటింగ్ కు వస్తున్న హీరోయిన్

mass song from where is venkatalakshmi movie

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన “ఖైదీ నెంబర్ 150” రత్తాలుగా అందరినీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. ఆ తరువాత “జూలీ” చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అయితే ఆమెకు అక్కడ ఏమాత్రం కలిసిరాలేదు. అందాలు మొత్తం ఒలికించిన కూడా బాలీవుడ్ ప్రేక్షకులు రాయ్ లక్ష్మీని పట్టించుకోలేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో మరీ నాజూగ్గా తయారైంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో “వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ” చిత్రంలో నటిస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ రాయ్ లక్ష్మీతో పాటు ఒక వ్యక్తి కూడా షూటింగ్ కు వచ్చేవాడట. అయితే ఈ వ్యక్తి రాయ్ లక్ష్మీకి స్నేహితుడో లేకపోతే బంధువులో అన్న భావనతో ఉన్న చిత్రబృందం అతడిని పెద్దగా పట్టించుకోలేదట. అయితే అతడితో రాయ్ లక్ష్మీ సాన్నిహిత్యం చూసిన వాళ్ళు విషయాన్ని ఆరా తీయగా… అతడు రాయ్ లక్ష్మీ బాయ్ ఫ్రెండ్ అనే విషయం బయటపడిందట.

గతంలో కూడా రాయ్ లక్ష్మీ కొంతమందితో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో ప్రముఖ క్రికెటర్ తో ఆమె డేటింగ్ చేస్తున్న వార్తలు వైరల్ అయ్యాయి. మరి మళ్ళీ రాయ్ లక్ష్మీ ప్రేమలో పడిందా ? అంటే… ఈ విషయంపై రాయ్ లక్ష్మీ స్పందిస్తేనే తెలుస్తుంది.

Related posts