రామ్ గోపాల్ వర్మ అనే పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది వివాదం. సోషల్ మీడియాలో తనదైన శైలిలో వివాదాస్పద పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ. ప్రస్తుతం దివంగత ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు వర్మ. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన రెండు పాటలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఈరోజు ఉదయం రామ్ గోపాల్ వర్మ చేసిన మరో పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. “బాహుబలి” సినిమాలో కట్టప్ప బాహుబలిని వెనుకనుంచి పొడిచిన పోస్టర్ లో మార్పు చేసి ఈ చిత్రంలో వ్యక్తులు ఎవరో గుర్తించేందుకు తనకు సాయం చేయాలంటూ పోస్ట్ చేశారు. ఇందులో బాహుబలి ముఖం ఎన్టీఆర్ లా, కట్టప్ప ముఖం చంద్రబాబు లా మార్పు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
ఇక ఇప్పుడు “లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ తరువాత కాసేపటికే మరో ఫోటోను విడుదల చేయగా… అందులో ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది వ్యక్తులు వైట్ డ్రెస్, పసుపు రంగు కండువాలు ధరించి భోజనం చేస్తున్నట్లుగా ఉంది. మొత్తానికి “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను వర్మ బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు.
A pic from #LakshmisNTR pic.twitter.com/heewp4ywlO
— Ram Gopal Varma (@RGVzoomin) January 21, 2019
A pic from #LakshmisNTR TheTrueStory pic.twitter.com/U3RN11pYnW
— Ram Gopal Varma (@RGVzoomin) January 21, 2019