telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైఎస్ఆర్ గృహవసతి పథకం కింద నిధులు విడుదల

జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలందరికీ ఇళ్లు పథకం అమలు కోసం రూ. 935 కోట్లు ఖర్చు చేసేందుకు పాలనానుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూమికి పరిహారం చెల్లింపు కోసం రూ. 935 కోట్లు విడుదల చేసింది రెవెన్యూ శాఖ. సీసీఎల్ఏ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లకు భూసేకరణ నిమిత్తం చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ గృహవసతి పథకం నిమిత్తం 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఈ నిధులు మంజూరు చేస్తున్నట్టు స్పష్టం చేసింది ప్రభుత్వం. విడుదలైన మొత్తంలో రూ. 88.92 కోట్లు నిర్వహణా వ్యయం కూడా ఉన్నట్టు రెవెన్యూ శాఖ పేర్కొంది. అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఏపీలో వాయిదా పడుతూనే ఉంది. వాస్తవానికి ఉగాది రోజున ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ సర్కార్ తొలుత ముహూర్తం నిర్ణయించింది. ఆ తర్వాత పలు కారణాలతో ఆ నిర్ణయం అంబేద్కర్ జయంతికి వాయిదా పడింది. అక్కడ్నించి జూలై 8 వైఎస్ జయంతి నాటికి ముహూర్తం మారింది. ఆ తర్వాత ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలనుకున్నా అది కూడా వీలుకాని పరిస్థితి ఏర్పడింది. ఇక సంక్రాంతికి ఈ ప్రక్రియ మొదల కానున్నట్టు సమాచారం.

Related posts