telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సముద్రంలో గల్లంతయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ లభ్యం

కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లైంతన నలుగురు మత్స్యకారుల ఆచూకీ ల‌భించింది. తాము క్షేమంగా ఉన్నట్లు ఫోన్‌ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. వారంతా డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని కొత్తపాలెం తీరానికి సురక్షితంగా చేరుకున్నారు.

మత్యకారులు చిన్న మస్తాన్, నాంచారరులు, నరసింహారావు, వెంకటేశ్వరరావు గత ఐదు రోజులుగా సముద్రంలో కనిపించకుండా పోయారు. చివరకు వారు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

మ‌త్స‌కారులు ఈ నెల రెండో తేదీన‌ నాలుగు బోట్లలో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అంతర్వేది దగ్గర బోటు మోటార్ పనిచేయడంలేదని బోట్ యజమానికి మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వారి ఫోన్లు చార్జింగ్‌ అయిపోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

అప్పటి నుంచి మత్స్యకారుల ఆచూకీ లభ్యంకాక పోవటంతో ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టారు. రోజులు గడుస్తున్న వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. మత్స్యకారుల ఆచూకీ కోసం ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు కాకినాడ తీరం సమీపంలో రెండు హెలికాప్టర్లతో గాలింపు ముమ్మరం చేశారు.

Related posts