telugu navyamedia
రాజకీయ

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా..

*బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా

*మంత్రులు తిరుగుబాటు చేయ‌డంతో రాజీనామా నిర్ణ‌యం

*54మంది మంత్రులు, ఎంపీలు రాజీనామా

బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం.. ఇప్పటికే 40 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకునేందుకు బోరిస్ జాన్సన్ అంగీకరించినట్లు ఆ దేశ మీడియా గురువారం వెల్లడించింది.. ఐతే కన్జర్వేటివ్ పార్టీ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు..తన పదవిలో కొనసాగుతానని స్పష్టం చేసినట్లు సమాచారం.

యూకే మీడియా కథనాల ప్రకారం.. బ్రిటన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 54 మంది మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ఎంతగా పెరిగిపోతోందంటే.. 36 గంటల క్రితం మంత్రి పదవి పొందిన మిచెల్ డొనెలన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం వరకు 17 మంది క్యాబినెట్ మంత్రులు, 12 మంది పార్లమెంటరీ కార్యదర్శులు, నలుగురు విదేశీ ప్రభుత్వ ప్రతినిధులు రాజీనామాను ప్రకటించారు.

బోరిస్ జాన్సన్ పాలనపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనాను సరిగ్గా ఎదుర్కోలేకపోయారని, లాక్‌డౌన్ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులుకు గురి చేశారని.. ఆయనపై మండిపడుతున్నారు. అంతేకాదు బోరిస్ జాన్సన్‌ సెక్స్ స్కాండల్‌పై వస్తున్న ఆరోపణలను కూడా ప్రస్తావిస్తున్నారు. మంత్రులు, ఎంపీల నుంచి తీవ్రంగా ఒత్తిడి రావడంతో.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని బోరిస్ నిర్ణయించుకున్నారు.

బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్, విదేశీ కామన్ వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ అఫైర్స్ సెక్రటరీ లిజ్ ట్రస్ ఉన్నట్లు తెలుస్తోంది

 

Related posts