telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఇంత రాక్షస రాజకీయం అవసరమా?-కోడిపందాలు దుష్ప్ర‌చారంపై చింత‌మ‌నేని ఫైర్‌

రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని అంటూ ఏపీ తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో జరిగిన కోడిపందాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఆయ‌న‌ కొట్టిపారేశారు.

పటాన్‌చెరు మండలం చినకంజర్లలో కోడిపందాలు పెద్ద ఎత్తున కోడి పందేలు జరిగాయి. 21 మంది పందాల రాయుళ్లను అరెస్ట్‌ చేశారు. 31 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటు మరో 40 మంది పరారీలో ఉన్నారని పటాన్ చెరు డీఎస్పీ వెల్లడించారు.

కోడిపందాల ఘటనపై సోషల్‌మీడియా వేదికగా చింతమనేని స్పందించారు.కోడిపందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్లుగా చూపటమే కొందరి అజెండా..ఇంత రాక్షస రాజకీయం అవసరమా? అని ప్రశ్నించారు.

రాజ‌కీయాన్ని రాజ‌కీయాంగానే ఎదుర్కొండి , ఈ దుర్మార్గ‌పు నీచ‌మైన ప్ర‌చారం ఇక‌నైన ఆపండి .. ఇటువంటి నీచమైన ప్రచారంతోనే కుప్ప‌కూలే మేడ‌లు క‌ట్టి అధికారంలోకి వచ్చిందని వచ్చారని విమర్శించారు.

తెలుగు ప్రజల్లో విష భీజాలు నాటి నాడు అధికారంలోకి వ‌చ్చారు. మీ మేడ కూలిపోయే సమయం అసన్నమైందని చింతమనేని ప్రభాకర్‌ పేర్కొన్నారు.

ప్ర‌జ‌లు కూకటివేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్న‌మైంద‌ని . ఆరోజు కోసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాక్షస రాజకీయ వికటాట్టహాసానికి త్వరలోనే ముగింపు త్వ‌ర‌లో ఉంద‌ని హెచ్చరించారు.

కోడిపందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్టు చూపిస్తున్నారని వాపోయారు. నీచమైన ప్రచారంతో… కుప్పకూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మీ మేడ కూలిపోయే సమయం అసన్నమైందని చింతమనేని ప్రభాకర్‌ పేర్కొన్నారు

Related posts