telugu navyamedia
రాజకీయ

నిరాడంబరంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం ..హాజరైన కేజ్రీవాల్..

పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం నిరాడంబరంగా జరిగింది . కుటుంబ సభ్యులతో పాటు, అతికొద్ది మంది సన్నిహితులు సమక్షంలో డాక్టర్ గురుప్రీత్ కౌ‌ర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో సిక్కు సంప్రదాయం ప్రకారం అతికొద్ది మంది సమక్షంలో ఈ విహహం జరిగింది.

కొద్దిమంది అతిథుల సమక్షంలో డాక్టర్ గుర్​ప్రీత్ కౌర్​ను సీఎం మాన్ వివాహమాడారు.

ఈ వివాహ వేడుక‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కుటుంబంతో పాటు ఇతర పార్టీ నేతలు ఈ వేడుకకు వెళ్లినవారిలో ఉన్నారు. ఈరోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్‌ మాన్‌కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు.

వివాహ వేడుక

కాగా.. . ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Mann Sahab స్పెషల్ డే అని పేర్కొన్నారు. ఆ ఫొటోలో భగవంత్ మాన్‌తో పాటు, అరవింద్ కేజ్రీవాల్, రాఘవ్ చద్దా ఉన్నారు. ఈ పెళ్ళిదుస్తుల్లో .. బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్‌ను ధరించి వెలిగిపోయారు పంజాబ్‌ సీఎం.

Image

వధువు డాక్టర్‌ గుర్‌ప్రీత్‌ కౌర్‌ కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె వయస్సు ప్రస్తుతం 32 ఏళ్లు. ఆమె తండ్రి ఇంద్రజిత్‌ సింగ్‌ ఓ రైతు కాగా.. తల్లి మాతా రాజ్‌ కౌర్‌ గృహిణి. గుర్‌ప్రీత్‌ ఇద్దరు సోదరిలూ విదేశాల్లో ఉంటున్నారు.

ముల్లానా వైద్య కళాశాలలో విద్యనభ్యసించిన గుర్‌ప్రీత్‌ కౌర్‌.. బంగారు పతకం కూడా సాధించారు.

కొన్నేళ్లుగా మాన్‌, గుర్‌ప్రీత్‌ కౌర్‌ కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె భగవంత్‌ మాన్‌కు ఎంతగానో సహాయం అందించినట్టు తెలుస్తోంది.

సిక్కు సంప్రదాయం ప్రకారం చంఢీగఢ్​లో జరిగిన ఈ వేడుకకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

పసందైన విందు

భగవంత్ పెళ్లిలో అతిథులకు భారతీయ, ఇటాలియన్ వంటలు సిద్ధం చేయించారు. కరాహీ పనీర్‌, తందూరి కుల్చే, దాల్ మఖానీ, నవరత్న బిర్యానీ, మౌసమీ సబ్జీలు, ఆప్రికాట్‌ స్టఫ్డ్‌ కోఫ్తా, లసగ్న సిసిలియానో, బుర్రానీ రైత వంటి రకరాకల వంటలు తయారు చేశారు.

మాన్ వివాహ విందు మెనూ

Related posts