telugu navyamedia
సినిమా వార్తలు

నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్..సమంత ‘పెట్‌ హ్యాష్‌’ కు థ్యాంక్స్‌

అక్కినేని నాగచైతన్య హీరోగా.. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘థ్యాంక్యూ’. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్‌ దర్శకత్వం వహించారు.

ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ మూవీని జులై 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్న నాగ చైతన్య తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్‌గా పోస్ట్‌ చేశాడు.

Image

తాజాగా నాగ చైతన్య తన మూవీ థ్యాంక్యూ జర్నీతోపాటు తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ”థ్యాంక్యూ’ అనేది చాలా గొప్ప పదం, మనం కొన్ని సార్లు ఎక్కువగా వాడుతుంటాం.. కొందరికి మనం ఎక్కువగా చెబుతుంటాం. కొందరికి చెప్పలేం..

Image

అయితే నా జీవితంలో ముగ్గురికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి’ అంటూ చైతన్య‌ చిన్నతనంలో తన తల్లితో తీసుకున్న ఫొటో, తండ్రి నాగార్జునతో కలిసి దిగిన పిక్‌తోపాటు సమంత పెంపుడు హ్యాష్‌తో తీసుకున్న ఫొటోను షేర్‌ చేశాడు.

. ‘అన్ని విషయాల్లో నాకు సపోర్ట్‌ చేస్తూ నాపై అంతులేని ప్రేమను చూపించిన అమ్మకు థ్యాంక్స్‌’, ‘నాకు తోడుగా నిలిచినందుకు, స్నేహితుడిగా ఉన్నందుకు థ్యాంక్స్ నాన్న’, ‘ఎలా ప్రేమించాలో, మనిషిగా ఎలా ఉండాలో చూపించినందుకు థ్యాంక్స్‌ హ్యాష్‌’ అంటూ ఎమోషనల్‌గా నోట్స్ రాసుకొచ్చాడు చైతూ. 

Image

 అలాగే తన అభిమానుల‌నంతా మీకు జీవితంలో ముఖ్యమైన వారి గురించి చెబుతూ ఫోటోలను షేర్ చేయండి.. థ్యాంక్యూ మ్యాజిక్ వర్డ్(#themagicwordisthankyou) అని హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయండి” అని ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, పోస్ట్‌ వైరల్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

Related posts