telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈ నెల 13న స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ

stalin kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ కేరళకు వెళ్లనున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనలో ఈ రెండు వారాల పాటు కేసీఆర్ బిజీబిజీగా గడపనున్నారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలో డిఎంకె అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో ఆయన నివాసంలో కేసీఆర్‌ భేటీ అవుతారు. దేశ రాజకీయాలపై కేసీఆర్‌-స్టాలిన్‌ చర్చిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉదయం కర్ణాటక సీఎం కుమారస్వామి, కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.

కేరళ, తమిళనాడు పర్యటనల తర్వాత కేసీఆర్ కర్ణాటకకు కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామితో భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత 70 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయని ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా రాష్ట్రాల హక్కులను రాష్ట్రాలకు దక్కకుండా చేస్తున్నాయని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ కూటమి ఏర్పాడాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.

Related posts