telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా చిన్ననాటి ఆల్బమ్ చూసారా..!

TAMANNA

లాక్‌డౌన్ ప్రభావంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉంటూనే తమ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా రోజూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. అయితే, ఈ క్వారంటైన్ టైమ్‌లో తన చిన్ననాటి ఫొటో ఆల్బమ్‌ను బయటికి తీశారు తమన్నా. ఆ ఆల్బమ్‌లో తనను తాను చూసుకుని మురిసిపోయారు. అంతటితో ఆగకుండా ఆ ఆల్బమ్‌ను తన అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చూపించారు. ఈరోజు పాత సామానులన్నీ సర్దుతుండగా నా చిన్ననాటి ఫొటోలతో కూడిన ఆల్బమ్ నా కంటపడింది. ఇక మిగిలిన సమయమంతా అందులోని ఫొటోలను చూస్తూ అప్పటి వెళకట్టలేని క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నాను. మీలో కూడా చాలా మంది చిన్ననాటి ఫొటోలు నిజంగా చాలా క్యూట్‌గా ఉంటాయి కదా? అని తమన్నా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన ఆల్బమ్‌ను కెమెరాకు చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పొందుపరిచారు.

Related posts