telugu navyamedia
క్రైమ్ వార్తలు

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : తుపాకీతో యువతిని కాల్చి చంపిన ఆర్మీ జవాన్

jawan

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన కేంద్రం ఎక్కడి వారు అక్కడే ఉండాలని చెబుతున్నా కొందరు నిషేధాజ్ఞ‌లను ఉల్లంఘించి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అందులో భాగంగా యూపీలోని మణిపురి పరిధిలోని అల్లీపూర్ గ్రామంలోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించే పనిని వివేక్ యాదవ్ అనే యువకుడికి అప్పగించారు గ్రామ పెద్దలు. వివేక్, అతని మరదలు సంధ్య యాదవ్ కలసి ఇతర రాష్ట్రాల నుంచి స్వగ్రామానికి వచ్చిన వారి వివరాలతో జాబితా రూపొందించారు. ఆ జాబితాను స్థానిక అధికారులకు అందించారు. జాబితాలో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ జాబితాలో ఆర్మీ జవాన్ శైలేంద్ర పేరు కూడా ఉంది. అతను కోల్‌కతా నుంచి స్వగ్రామం అల్లీపూర్ వచ్చాడు.అయితే తన పేరు జాబితాలో ఎందుకు చేర్చావంటూ వివేక్ యాదవ్‌తో జవాన్ శైలేంద్ర గొడవపడ్డాడు. అంతలో వివేక్ మరదలు సంధ్య కలగజేసుకోవడంతో ఆగ్రహం చెందిన శైలేంద్ర తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. సంధ్య అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Related posts