telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వెబ్సైట్లో చూసి భయంకరమైన రోగాన్ని నిర్ణయించేసుకున్నాడు… తీరా డాక్టర్ దగ్గరకు వెళ్తే…!!?

Legs

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో‌కు చెందిన మార్క్ ష్రేబర్ అనే వ్యక్తి.. తన కాళ్లు గత కొన్ని రోజులుగా నీలం రంగులోకి మారడాన్ని గమనించాడు. దీంతో కంగారు పడిపోయిన ఆయన.. ఓ వెబ్‌సైట్‌ ద్వారా సమస్య ఏంటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆయన సమస్యకు సంబంధించిన లక్షణాలన్నింటినీ వెబ్‌సైట్‌లో నమోదు చేశాడు. నమోదు చేసిన లక్షణాలను బట్టి.. ఆయనకు ‘డీప్ వీన్ త్రాంబోసిస్’ వ్యాధి వచ్చినట్లు ఆ వెబ్‌సైట్ తేల్చేసింది. దీంతో మరింత కంగారుపడ్డ మార్క్ ష్రేబర్.. వైద్యం కోసం డాక్టర్లను సంప్రదించాడు. వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆయనకు వైద్యులు షాకింగ్ నిజాన్ని చెప్పారు. అతనికి ‘డీప్ వీన్ త్రాంబోసిస్’ లేదని.. కేవలం కొత్తగా కొనుకున్న జీన్స్‌ను వాష్ చేయకుండా అలాగే వేసుకోవడం వల్లే కాళ్లు నీలం రంగులోకి మారాయని తేల్చేశారు. దీంతో ఊపిరిపీల్చున్న మార్క్ ష్రేబర్.. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Related posts