telugu navyamedia
క్రైమ్ వార్తలు

వాహనదారులు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: – రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌

police

లాక్‌డౌన్‌ సమయంలో తమనెవరూ పట్టించుకోలేరనే ఉద్దేశంతో పలువురు వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ట్రై కమిషనరేట్‌ల పరిధిలో మార్చి 22 నుంచి 29 వరకు మొత్తం 2,02,445 కేసులు నమోదయ్యాయి.1700 వాహనాలు సీజ్‌ చేశారు.  లాక్‌డౌన్‌ సమయంలో ద్విచక్రవాహనం మీద ఒక్కరు, కారులో అయితే ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంది. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పరిస్థితిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నిరంతరం పరిశీలిస్తుంటారు. నగరంలో సీసీ కెమెరాలకు తోడుగా ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంటలిజెన్స్‌ సిస్టమ్‌ కూడా కేసుల నమోదులో సాక్ష్యా లు నమోదు చేసి చలాన్లు విధిస్తున్నాయి.లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బయటకు వస్తే వారి వాహనాలు సీజ్‌ చేస్తాం. హైదరాబాద్‌లో 12 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిని దవాఖానలో ఉన్న క్వారైంటన్‌లోకి పంపిస్తాం.

Related posts