telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కోచ్, కెప్టెన్ ప్రోత్సహంతోనే ..ఇవ్వన్ని సాధ్యం.. : విహారి

vihari on his success with kohli and ravi

టీమిండియా యువ ఆటగాడు హనుమ విహారి, సారథి విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి తన ప్రదర్శనను చూసి ఎంతో ఆనందించారని అన్నాడు. జట్టు మొత్తం తనను ప్రోత్సహించిందని వెల్లడించాడు. రెండో టెస్టు ముగిసిన తర్వాత విరాట్‌ తనకు ట్రోఫీ అందించి కౌగిలించుకున్నాడని విహారి తెలిపాడు. సిరీస్‌ గెలిచిన తర్వాత కోహ్లీ నేరుగా నా వద్దకొచ్చాడు. ట్రోఫీ పట్టుకోమన్నాడు. ఆ తర్వాత నన్ను కౌగిలించుకున్నాడు. అతడు ట్రోఫీ నాకు అందించి తన ఉదారతను చాటుకున్నాడు. గెలిచిన ట్రోఫీ పట్టుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదొక అద్భుతమైన జట్టు.  విదేశాల్లో సిరీస్‌ గెలిస్తే ఎంతో గొప్పగా ఉంటుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ను భారీ విజయంతో ఆరంభించినందుకు చాలా సంతోషంగా ఉంది.. అని విహారి అన్నాడు.

విహారి తొలి టెస్టులో 7 పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నా, కీలకమైన పరుగులు అందించాడు. అతడి ఇన్నింగ్స్‌కు మురిసిన కోహ్లీ అతడి దగ్గరకు వచ్చి అభినందనలు తెలియజేశాడు. ‘శతకం చేజారడంపై మేం మాట్లాడుకోలేదు. అద్భుతమైన ఇన్నింగ్స్‌ అని కోహ్లీ ప్రశంసించాడు. నా కెప్టెన్‌, కోచ్‌, జట్టు యాజమాన్యం నన్నెంతో ప్రోత్సహించారు. కోహ్లీ స్వేచ్ఛనిచ్చాడు. శాస్త్రి సర్‌ ప్రేరణనిచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టులో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి మరెన్నో ఇన్నింగ్స్‌లు మున్ముందు ఆడాలని కోరుకుంటున్నా’ అని హనుమ విహారి తెలిపాడు.

Related posts