విశాఖ శారదా పీఠం అన్నా, పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నా తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎంత నమ్మకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిన్ననే విజయవాడలో శారదా పీఠం ఉత్తరాధికారి నియామక కార్యక్రమానికి కూడా కేసీఆర్ హాజరై తన ఆధ్యాత్మిక గురువు దీవెనలు అందుకున్నారు. స్వరూపానంద ఆధ్వర్యంలోనే ఎన్నికల ముందు రాజశ్యామల యాగం నిర్వహించారు.
శారదా పీఠానికి తెలంగాణలో స్థలం కేటాయించాలని కేసీఆర్ మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. శారదా పీఠానికి రెండెకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ సినీ దర్శకుడు ఎన్.శంకర్ కు స్టూడియో నిర్మాణం కోసం మోకిళ్ళ వద్ద 5 ఎకరాల భూమి ఇవ్వాలని కూడా తీర్మానించారు.