telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈసారి ముద్దు… ప్రియుడితో మలైకా ఫోటో వైరల్

Malaika

బాలీవుడ్ నటుడు అర్జున్‌ కపూర్‌కి, డ్యాన్సర్ మలైకా అరోరా 2019లో తమ ప్రేమను అధికారికంగా ప్రకటించేశారు. అయితే 2020 తొలిరోజున మాత్రం ఇంకాస్త ఘాటుగా తామిద్దరం ప్రేమలో ఉన్నామని చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా మలైకా, అర్జున్ ఓ పార్టీలో తెగ ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో మలైకా అర్జున్ బుగ్గపై ముద్దుపెడుతూ ఫొటో దిగారు. ఆ ఫొటోను మలైకా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు బెస్ట్ న్యూ ఇయర్ కానుకను ఇచ్చారు. 2020లో వీరిద్దరూ దిగిన తొలి సెల్ఫీ ఇదే. అయితే ఈసారి మలైకా వేడుకలకు విదేశాలకు వెళ్లలేదు. తన ప్రియుడు అర్జున్‌తో కలిసి గోవా వెళ్లింది. ఇంకొన్ని రోజుల పాటు వీరిద్దరూ అక్కడే ఉండబోతున్నారట. అయితే 2020లో మాత్రం పక్కా పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. మరోపక్క మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తన ప్రేయసి జార్జియా ఆండ్రియానితో కలిసి ఎంజాయ్ చేశారు. 2020లో వీరు కూడా పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది.

Related posts