telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరో అజిత్ సరసన బాలీవుడ్ బ్యూటీ ?

Yami-Gautham

తెలుగుతోపాటు కన్నడ, తమిళ చిత్రాలు కూడా చేసింది బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్. అయినప్పటికీ ఆమెకు దక్షిణాదిలో నిరాశే ఎదురైంది. అయితే బాలీవుడ్‌ నుంచి మాత్రం ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. గ్లామర్‌పరంగానే కాకుండా మంచి నటిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది. దీంతో యామీకి మళ్లీ దక్షిణాది నుంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సరసన నటించే అవకాశం యామీకి వచ్చినట్టు తెలుస్తోంది. దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తున్న చిత్రంలో అజిత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ప్రియాంకా చోప్రా, కియారా ఆడ్వాణీ పేర్లు పరిశీలించారు. కానీ ఫైనల్‌గా యామీ గౌతమ్‌ను ఎంపిక చేశారట. ఈ సినిమా విజయవంతమైతే యామీకి దక్షిణాది నుంచి కూడా భారీ ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయి. తెలుగులో `నువ్విలా`, `కొరియర్‌బాయ్ కల్యాణ్` వంటి సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది యామీ గౌతమ్.

Related posts