telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అలియా, రణబీర్ పెళ్ళి… ఫోటో వైరల్

Alia

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, చాకోలెట్ బాయ్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌ ల ప్రేమాయణం గురించి తెలిసిందే. అయితే ఈ జంట త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గ‌త ఏడాది నుండి వీరిరివురు రిలేష‌న్‌లో ఉండ‌గా… వీరి పెళ్ళికి సంబంధించి మ‌రో కొత్త డేట్ వార్త‌ల‌లోకి వ‌చ్చింది. బాలీవుడ్ స‌ర్కిల్స్ ప్ర‌కారం అలియా, ర‌ణ్‌బీర్‌ల నిశ్చితార్దం అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నుండ‌గా, వివాహం వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. అస‌లు వివాహం ఇదే ఏడాదిలో జ‌ర‌గాల్సి ఉన్న‌ప్ప‌టికి, ర‌ణ్‌బీర్ తండ్రి అనారోగ్యానికి గుర‌వ్వ‌డం, అలియా హెల్త్ కూడా స‌రిగ్గా లేక‌పోవ‌డంతో పెళ్ళిని వ‌చ్చే ఏడాదికి వాయిదా వేశారనేది ఈ వార్తల సారాంశం. కాగా ఓ టెక్నాల‌జీ ఎక్స్‌ప‌ర్ట్ ఫోటోషాప్‌తో అలియా భ‌ట్‌, ర‌ణ్‌భీర్ క‌పూర్ వెడ్డింగ్ ఫోటో రెడీ చేశారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అలియా భ‌ట్ ఇటీవ‌ల ఓ యాడ్‌లో మోడ‌ల్‌తో న‌టించ‌గా, ఆ మోడ‌ల్ ఫేస్‌ని ర‌ణ్‌బీర్ ఫేస్‌తో ఫోటో షాప్ చేశారు. ఈ ఫోటో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts