telugu navyamedia
ఆరోగ్యం

వ్యామయంతో పిలల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది

*వ్యాయామం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతోందట. దీంతో వారు చదువుతో కుస్తీ పడాల్సిన అవసరం లేదు. చక్కగా చదువుకుని పరీక్షల్లో రాణించగలుగుతారు. వారికి ఆరోగ్యం కోసం నిత్యం సరైన సమయానికి పౌష్టికాహారాన్ని అందివ్వాలి. దీంతో వారు శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.
*రోజు కనీసం 60 నిమిషాల పాటు వ్యాయామం చేసే పిల్లలు చదువుల్లో కూడా బాగా రాణిస్తారని నిపుణులు అంటున్నారు. పిల్లల్ని రోజూ క‌నీసం 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేసేలా ప్రోత్స‌హించాల‌ని, లేదా కనీసం ఆటలు ఆడుకునేందుకు పెద్దలు అనుమతించాలని వారు సూచిస్తున్నారు.


* మితిమీరిన వ్యాయామం కారణంగా ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల రోజు మొత్తంలో ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం మరో 30 నిమిషాల పాటు పిల్లలతో వ్యాయామం చేపిస్తే సరిపోతోంది.
*ఉదయంపూట వ్యాయమం చేయించటం వల్ల వారి మెదడు చురుకుగా పనిచేస్తుంది.
*చిన్నతనంలో శారీరక వ్యాయామం చేయడం వల్ల పిల్లలు పెరిగి పెద్దయ్యాక శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారట. ముఖ్యంగా బాల్యం తరువాత వచ్చే కౌమార దశలో పిల్లలు వ్యాయామం చేస్తే వృత్తి రీత్యా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకారట. అలాంటివాళ్లకు మిడిల్ ఏజ్‌లో గుండె జబ్బులు, ముసలితనంలో అల్జీమర్స్ రాకుండా ఉంటాయట.


*వ్యాయామం నేరుగా మెదడు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కనుక వ్యాయామాన్ని పొట్ట తగ్గటానికి, లావు తగ్గటానికి అనే కాకుండా ఆరోగ్యం కోసం చెప్పి వారికి అలవాటు చేయాలి తల్లిదండ్రులు.
*ఈ రోజుల్లో పిల్లలు ఫాస్ట్​ కల్చర్​కు అలవాటు పడిపోతున్నారు. ఇంట్లో ఆహారం కంటే బయటి ఫుడ్​తోనే ఎక్కువగా కడుపు నింపేసుకుంటున్నారు. అందుకే పిల్లలకు జంక్ ఫుడ్​ను దూరంగా ఉంచండి.
* పిల్లలకు ఎక్కువుగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, పాలు పదార్ధాలు వంటివి ఎక్కువగా పెట్టాలి.
*అలాగే మలబద్ధకంతో బాధపడే చిన్నారులకు వ్యాయామం చాలా మేలు చేస్తుంది. వ్యాయామం చేయటంవల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగటంతోపాటు, వారిలో ఆకలి కూడా పెరుగుతుంది.

Related posts