telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కూల్‌ డ్రింక్స్‌ తాగుతున్నారా… అయితే ఈ సంచలన నిజాలు తెలుసుకోండి !

ఎండాకాలం వచ్చేసింది. ఇంకేం అందరూ ఉక్కపోతతో  ఇబ్బంది పడుతుంటారు. దీంతో అందరూ ఏసీ, కూలర్లు, ఫ్యాన్స్ వడటం మొదలు పెట్టారు. ఇక ఈ కాలంలో వడదెబ్బ తగలడం చాలా సహజం. ఇది వికటించినా .. మృత్యువాత పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే.. ఎండాకాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది కూల్‌ డ్రింక్స్‌ను ఎండా పెడా తాగేస్తుంటారు. ఇంకా కొంత మందైతే కాలాలతో సంబంధం లేకుండా కూల్‌ డ్రింక్స్‌ను తాగుతుంటారు. అయితే నిజానికి ఇవి మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కూల్‌ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కూల్‌ డ్రింక్స్‌ను అధికంగా తాగితే బరువు త్వరగా పెరుగుతారు. దీంతో అధిక బరువు పెరుగుతారు. ఫలితంగా డయాబెటిస్‌, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక బరువు తగ్గాలను కునే వారు కూల్‌ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. అలాగే ఇతరులు కూడా కూల్‌ డ్రింక్స్‌ను ఎంత తక్కువగా తాగితే అంత మంచింది. కూల్‌ డ్రింక్స్‌ తాగాలనిపించినప్పుడు సహజసిద్ధమైన పానీయాలు తాగండి. కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ రసం, చెరకు రసం తదితర పానీయాలు తాగడం వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి.

Related posts