telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎండాకాలంలో సబ్జా_గింజలు తింటే ఎన్నో ప్రయోజనాలు

సబ్జా_గింజలు..ఇవి చిన్నగా ఉన్నా కూడా ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి. మూడు గ్రాముల సబ్జా గింజలు తీసుకొని 10 నిముషాలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత అవి జెల్ రూపంలో అవుతాయి. జెల్ రూపంలో ఉన్నా వీటిని డైరెక్ట్ గా తినొచ్చు లేదా వీటిని ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ జ్యూస్, మజ్జిగలో కలిపి తీసుకొచ్చు. ఎలా తీసుకున్న కూడా ఇది ఆరోగ్యానికి చాల మంచిది. సంజా గింజలతో నయమయ్యే సమస్యలేంటో చూద్దాం.

అధిక బరువు:

అధిక బరువుతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. ఎందుకంటే ఈ గింజలను తింటే మీకు కడుపు నిండుగా ఉండి ఆకలి వేయదు. దీంతో ఈజీ గా బరువు తగ్గుతారు.

శ్వాసకోశ సమస్యలు:

శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చటి నీటిలో కొంచం తేనె, అల్లం రసం, అందులో ఈ సబ్జా గింజలను వేసి తాగాలి.ఇలా చేస్తే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

జీర్ణ సమస్యలు:

సబ్జా గింజలతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవోచ్చు. సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యి జీర్ణ సంబంధ సమస్యలు కూడా పోతాయి. ఇందులో ఎక్కువగా ఉండే డైటరీ ఫైబర్ వల్ల మలబద్దకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. గ్యాస్‌, అసిడిటీ సమస్యలు కూడా చాల వరకు తగ్గిపోతాయి.

గాయాలకు ఇది గొప్ప మందు:

సబ్జా గింజలను తీసుకొని పొడి చేసి, ఆ పొడిని గాయాలపైనా వేసి కట్టు కట్టాలి. దీంతో గాయాలు త్వరగా మానుతాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు కూడా దగ్గరకు రావు.

తలనొప్పి:

తల నొప్పి ఉన్నవారు ఈ సబ్జా గింజలను నీటిలో వేసుకొని తింటే తల నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. మైగ్రేన్ వంటి సమస్యలకు కూడా ఇది గొప్ప ఔషధంలా పని చేస్తుంది. ఈ సబ్జా గింజలతో రక్త సరఫరా మెరుగుపడి బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

ఆర్థరైటిస్‌:

కీళ్ల నొప్పులతో బాధపడే వారికీ ఇది మంచి ఫలితాన్ని దక్కిస్తుంది. అలాంటివారు సబ్జా గింజలను తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం దక్కుతుంది.

అలర్జీ:

యాంటీ బయోటిక్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్ గుణాలు సబ్జా గింజల్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షనైనా, అలర్జీనైనా తరిమికొటొచ్చు. ఇవి అలర్జీలు, ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి.

డిప్రెషన్:

సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి తినడం వల్ల ఒత్తిడికి, అలసటకు దూరమయ్యి డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ఈ అంశం పై పలువురు సైంటిస్టులు కూడా ప్రయోగాలు చేసి నిరూపించారు.

మధుమేహం సమస్యలు:

చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.

చలవైన సబ్జా గింజలు:

అంతేకాకుండా సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగితే మాడు పగిలిపోయే వేసవి కాలంలో ఇది చలవ చేస్తుంది. ఎండాకాలంలో మనం తాగే అన్ని పానీయాల కంటే ఇది చాల మేలు చేస్తాయి.

 

 

Related posts